Andhra Pradesh Pensions: ఒకరోజు ముందుగానే పెన్షన్లు
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:10 AM
ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే సామజిక పింఛను ఈ నెలలో ఒక రోజు ముందుగానే అందించనుంది.
నేడు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పంపిణీ
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఇచ్చే సామజిక పింఛను ఈ నెలలో ఒక రోజు ముందుగానే అందించనుంది. జనవరి 1 కాకుండా డిసెంబరు 31 (బుధవారం)న పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌ల పంపిణీ కోసం ముందుగానే రూ.2743 కోట్లు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.12 లక్షల పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటివద్దనే లబ్ధిదారులకు అందజేయనున్నారు. బుధవారం పింఛను అందనివారికి జనవరి 2న వారివారి ఇళ్ల వద్దనే సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు.