Soccer Star David Beckham Visits Gurukula School: గురుకుల పాఠశాలలో సాకర్ స్టార్ బెక్‌హామ్
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:32 AM
సాకర్ స్టార్, ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ విజయనగరం జిల్లాలో సందడి చేశాడు. లక్కవరపుకోట మండలం రంగాపురం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ....
విద్యార్థినులతో ఫుట్‌బాల్ ఆడి సందడి
శృంగవరపుకోట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సాకర్ స్టార్, ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ డేవిడ్ బెక్‌హామ్ విజయనగరం జిల్లాలో సందడి చేశాడు. లక్కవరపుకోట మండలం రంగాపురం మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. యూనిసెఫ్ అంబాసిడర్‌గా ఇక్కడకు వచ్చిన ఆయన బుధవారం.. విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. వారు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. తరగతి గదులు, విద్యావిధానం, బోధన, భోజనం, వసతి, ఇతర సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి కాసేపు ఫుట్‌బాల్ ఆడారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడిన బాలికలకు సమగ్ర విద్యాబోధన, నాణ్యమైన భోజన వసతి కల్పించేందుకు ఈ గురుకుల పాఠశాలను స్థాపించారు. యూనిసెఫ్ అందించే సాయానికి ఈ పాఠశాల ఎంపికైంది.