CPI Ramakrishna: నాడు పగలకొట్టాలని.. నేడు బిగిస్తారా
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:35 AM
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పగలకొట్టాలని పిలుపునిచ్చి అధికారంలోకి వచ్చాక బిగించడం సరైందేనా?
అదానీకి లబ్ధి కోసమే స్మార్ట్ మీటర్లు: సీపీఐ రామకృష్ణ
విజయవాడ(ధర్నాచౌక్), జూలై 21(ఆంధ్రజ్యోతి): నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పగలకొట్టాలని పిలుపునిచ్చి అధికారంలోకి వచ్చాక బిగించడం సరైందేనా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలో పని చేస్తున్న మీటర్ రీడర్లు, నూతన షిఫ్ట్ ఆపరేటర్లు, ఎనర్జీ అసిస్టెంట్లు, పర్మినెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో ‘చలో విజయవాడ’లో భాగంగా ధర్నాచౌక్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అదానీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.