Kurnool District: చిన్న ప్రాజెక్టు..పెద్ద ఆనందం
ABN , Publish Date - Sep 06 , 2025 | 05:15 AM
ఇది చెన్నరాయుడుతిప్ప (చంద్రాయణతిప్ప) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్! నిల్వ సామర్థ్యం రీత్యా చూస్తే... చాలా చిన్నది. కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామం దగ్గర ఉంటుంది.
పాతికేళ్లకు నిండిన చెన్నరాయుడు తిప్ప
భూగర్భ జలాలు పైపైకి.. రైతుల్లో హర్షం
ఇంటర్నెట్ డెస్క్: ఇది చెన్నరాయుడుతిప్ప (చంద్రాయణతిప్ప) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్! నిల్వ సామర్థ్యం రీత్యా చూస్తే... చాలా చిన్నది. కర్నూలు జిల్లా గూడూరు మండలం బూడిదపాడు గ్రామం దగ్గర ఉంటుంది. 1994లో కోట్ల విజయభాస్కరెడ్డి హయాంలో దీనిని నిర్మించారు. దీని కింద 101.34 ఎకరాల ఆయకట్టు ఉంది. 31ఏళ్లలో రెండు, మూడుసార్లు మాత్రమే దీనిని నింపారు. గత పాతికేళ్లుగా ఒక్క చుక్కనీరు కూడా ఈ ప్రాజెక్టుకు చేరలేదు. ఈ ఏడాది మంచి వర్షాలు కురవడం, తుంగభద్ర జలాశయానికి సామర్థ్యానికి మించి వరద చేరడంతో ఎల్లెల్సీ కాలువ ద్వారా చెన్నరాయుడుతిప్పను జలాలతో నింపారు. మళ్లీ ఇన్నేళ్లకు జలకళ చూస్తూ రైతులు మురిసిపోతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలూ పెరుగుతాయని, హంద్రీనీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్-1 ఎస్‌ఈ పాండురంగయ్య తెలిపారు.
- కర్నూలు, ఆంధ్రజ్యోతి