Guntur District: తెనాలిలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:35 AM
రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు బయటపడ్డాయి.
తెనాలి అర్బన్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఆరు స్క్రబ్ టైఫస్ కేసులు బయటపడ్డాయి. వారందరికీ చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఆదివారం తెలిపారు. స్క్రబ్ టైఫస్ బాధితుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం చికిత్స పొందుతున్న ఒకరి ఆరోగ్యం మెరుగవ్వడంతో డిశ్చార్జ్ చేశామని చెప్పారు.