Share News

Natal Teeth: పుట్టుకతోనే పాల దంతం..

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:43 AM

సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నెలలకు పాల దంతాలు వస్తుంటాయి. కానీ, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన దుర్గ..

Natal Teeth: పుట్టుకతోనే పాల దంతం..

ఆరు నెలల శిశువుకు పన్ను తొలగింపు

నూజివీడు టౌన్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా శిశువు జన్మించిన ఆరు నెలలకు పాల దంతాలు వస్తుంటాయి. కానీ, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన దుర్గ అనే మహిళకు జన్మించిన పాపకు పుట్టకతోనే పన్ను ఉంది. దీంతో నూజివీడుకు చెందిన దంత వైద్యుడు దేవిశెట్టి దినేశ్‌బాబు 6 రోజుల పసికందుకు ఆ పన్నును తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిశువుకు అరుదైన జన్యు సమస్య వల్ల ఇలా పుట్టకతోనే పన్ను వచ్చిందని చెప్పారు. ఆ పన్ను పన్ను కోరగా ఉండడంతో దాన్ని తొలగించినట్టు పేర్కొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 05:45 AM