Share News

నవోదయ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:16 AM

బ్రహ్మంగారిమఠం మండలం లోని మల్లేపల్లె పంచాయతీలో 30 ఎకరాలు పైబడి నవోదయ పాఠశాల నిర్మాణానికి చేపట్టేందుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరు కూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాద వ్‌ బద్వేలు ఆర్డీఓ చంద్రమోహనతో కలిసి పరిశీలించారు.

నవోదయ పాఠశాల నిర్మాణానికి స్థల పరిశీలన
గురుకుల పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శ్రీధర్‌, ఎమ్మెల్యే పుట్టా

బ్రహ్మంగారిమఠం, జూన 16 (ఆంధ్ర జ్యోతి): బ్రహ్మంగారిమఠం మండలం లోని మల్లేపల్లె పంచాయతీలో 30 ఎకరాలు పైబడి నవోదయ పాఠశాల నిర్మాణానికి చేపట్టేందుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరు కూరి, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాద వ్‌ బద్వేలు ఆర్డీఓ చంద్రమోహనతో కలిసి పరిశీలించారు. త్వరలోనే నిధులు కేటాయించి పనులను ప్రారంభించేందు కు చర్యలు చేపడతామని కలెక్టర్‌, ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే తోట్లపల్లె గ్రామంలో 500 మంది విద్యార్థులకు పైగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల మౌలిక వసతులు లేకపోవడంతో పాఠశాల విద్యార్థులు చేరలేదు. ఈ నేపఽథ్యంలో కలెక్టర్‌ , ఎమ్మెల్యేలు పాఠశాలను సందర్శించి జూలై మొదటివారం కల్లా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించడంతోపాటు పాఠశాలను మొదటివారంలో ప్రారంభిస్తామని వారు తెలిపారు. కాగా 10.5 ఎకరాల శ్మశాన వాటిక స్థలాన్ని వారు పరిశీలించారు. అనంతరం కాలజ్ఞాన కర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వా మిని కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌, బద్వేలు డివిజన ఆర్డీవో చంద్రమోహనలు దర్శించుకున్నారు. వారికి ఆలయ ఫిట్‌పర్సన శంకరబాలాజీ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి వసా్త్రలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దారు రాజనరసింహనరేంద్ర, డీటీ జాన్సన, మం డల టీడీపీ అధ్యక్షులు చెన్నుపల్లి సుబ్బారెడ్డి, కాణాల మల్లిఖార్జునరెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన రవీంద్ర, సర్పంచ నారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:16 AM