Vijayawada Court: కోర్టు సందేహాలకు సిట్ జవాబులు
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:40 AM
మద్యం కుంభకోణంలో దాఖలు చేసిన 2 చార్జిషీటులపై కోర్టు వ్యక్తం చేసిన సందేహాలకు సిట్ అధికారులు సమాధానాలు ఇచ్చారు. వివరణతో కూడిన పిటిషన్‌ను...
మిథున్‌రెడ్డి బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా
విజయవాడ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో దాఖలు చేసిన 2 చార్జిషీటులపై కోర్టు వ్యక్తం చేసిన సందేహాలకు సిట్ అధికారులు సమాధానాలు ఇచ్చారు. వివరణతో కూడిన పిటిషన్‌ను కోర్టులో అందజేశారు. కొద్దిరోజుల క్రితం చార్జిషీట్‌లపై ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు 21 సందేహాలను లేవనెత్తుతూ సిట్ దర్యాప్తు అధికారికి మెమో పంపారు. కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్, మద్యం కేసులో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లపై మంగళవారం జరగాల్సిన విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.