Raj Kasi Reddy: ఐఓ, బ్యాంకు మేనేజర్ కోర్టు ఆదేశాలు పాటించడం లేదు
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:40 AM
సిట్ అధికారులు ఫాం హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్లకు సంబంధించి కోర్టు ఆదేశాలను సిట్ దర్యాప్తు అధికారి (ఐఓ), బ్యాంక్ మేనేజర్ పాటించడం లేదని...
ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి పిటిషన్
విజయవాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): సిట్ అధికారులు ఫాం హౌస్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 11 కోట్లకు సంబంధించి కోర్టు ఆదేశాలను సిట్ దర్యాప్తు అధికారి (ఐఓ), బ్యాంక్ మేనేజర్ పాటించడం లేదని లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. రూ. 11 కోట్లను బ్యాంకులో జమచేసిన సమయం, కౌంటర్ ఫాయిల్, సీసీ ఫుటేజీ వివరాలను అందజేయాలని ఐఓను.. అలాగే నగదుకు సంబంధించిన లెడ్జర్, చెస్ట్‌కు పంపిన సీసీ కెమెరా ఫుటేజీ, చెస్ట్‌లో నగదును లెక్కించిన ఫుటేజీని ఇవ్వాలని బ్యాంకును కోర్టు ఆదేశించినా ఇప్పటి వరకు సమర్పించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.