SIT: మద్యం కేసులో సొమ్ము డిపాజిట్‌కు అనుమతి కోరుతూ పిటిషన్
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:28 AM
మద్యం కుంభకోణంలో సాక్షి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు...
విజయవాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో సాక్షి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడలోని ఏసీబీ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. 439వ సాక్షిగా ఉన్న ముబారక్ అలీ నుంచి విచారణ సమయంలో రూ.9.20 లక్షలు స్వాధీనం చేసుకున్నామని కోర్టుకు తెలిపారు. ఈ నగదును బ్యాంకులో డిపాజిట్, లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.