Share News

Sibling Bond: అన్న సమాధికి రాఖీ

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:57 AM

భౌతికంగా దూరమైన తన అన్నను తలచుకుంటూ ఓ చెల్లి రాఖీ పౌర్ణమి రోజున అతని సమాధికి రక్షాబంధన్‌ కట్టింది.

 Sibling Bond: అన్న సమాధికి రాఖీ

ఇంటర్నెట్ డెస్క్: భౌతికంగా దూరమైన తన అన్నను తలచుకుంటూ ఓ చెల్లి రాఖీ పౌర్ణమి రోజున అతని సమాధికి రక్షాబంధన్‌ కట్టింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం చల్దిమామిడికి చెందిన రెడ్డి సూర్యప్రకాశ్‌ (వీఆర్‌ఏ) అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు. శనివారం రక్షాబంధన్‌ కావడంతో చింతపల్లిలో ఉంటున్న అతని సోదరి సంధ్యాకుమారి 100 కిలోమీటర్లు ప్రయాణించి చల్దిమామిడి చేరుకుంది. తన అన్న సమాధిని శుభ్రం చేసి నైవేద్యం పెట్టింది. సమాధికి రాఖీ కట్టి కన్నీటి పర్యంతమైంది.

- పెదబయలు, ఆంధ్రజ్యోతి

Updated Date - Aug 10 , 2025 | 05:58 AM