BJP Leader: సరళీకృత జీఎస్టీ ఎంఎ్‌సఎంఈలకు ప్రాణవాయువు
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:33 AM
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన జీఎ్‌సటీ సంస్కరణలు మధ్య తరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నవేనని బీజేపీ...
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన జీఎ్‌సటీ సంస్కరణలు మధ్య తరగతి ప్రజల జీవన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నవేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం అన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మధ్య తరగతికి అవసరమయ్యే అనేక వస్తువులు 5శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుండటం ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించే విషయమన్నారు. సామాన్య, మధ్య తరగతిలో కొనుగోలు శక్తి పెరగడం వల్ల మార్కెట్ పుంజుకుని దేశ ఆర్థిక వ్యవస్థ వేగవంతమవుతుందని చెప్పారు. ఎంఎ్‌సఎంఈ రంగానికి ఈ సంస్కరణలు ప్రాణవాయువు లాంటివని, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ మోదీ సర్కారు ఆర్థిక దృక్ఫథంతో మధ్య తరగతి సాధికారత, పరిశ్రమల బలోపేతం, సమగ్ర అభివృద్ధికి మార్గం మరింత సులువైందన్నారు.