Share News

Vijayawada: దసరా విధులకు వచ్చిన ఎస్‌ఐ ఆకస్మిక మృతి

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:00 AM

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన విజయనగరం జిల్లా పూసపాటిరేగ ఎస్‌ఐ వడ్డాది శ్రీనివాసరావు (52) ఆకస్మికంగా మృతి చెందారు.

 Vijayawada: దసరా విధులకు వచ్చిన ఎస్‌ఐ ఆకస్మిక మృతి

  • మృతుడు పూసపాటిరేగ ఎస్‌ఐ

విజయవాడ(వన్‌టౌన్‌), సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన విజయనగరం జిల్లా పూసపాటిరేగ ఎస్‌ఐ వడ్డాది శ్రీనివాసరావు (52) ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనతో పాటుమరో నలుగురు కలసి హనుమాన్‌పేటలోని ఒక లాడ్జిలో బస చేశారు. సోమవారం ఉదయం విధులకు హాజరయేందుకు సిద్ధం కావడానికి బాత్‌రూమ్‌కు వెళ్లారు. బాత్‌రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలుజారిపడి పోయాడు. వె ంటనే స్పృహ కోల్పోయాడు. సహచరులు గమనించి 108కు ఫోన్‌చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి శ్రీనివాసరావును పరిశీలించి అప్పటికే ప్రాణం పోయినట్లు నిర్ధారించారు. తర్వాత బంధువులకు సమాచారం అందజేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 30 , 2025 | 05:01 AM