Share News

Shyam Institute: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో శ్యామ్‌ విజయదుందుభి

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:40 AM

పోలీస్‌ కానిస్టేబుల్స్‌-2025 ఫలితాల్లో కాకినాడ శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడమే...

Shyam Institute: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో శ్యామ్‌ విజయదుందుభి

కాకినాడ(కార్పొరేషన్‌), ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కానిస్టేబుల్స్‌-2025 ఫలితాల్లో కాకినాడ శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించడమే కాకుండా అత్యధిక పోస్టులను కైవసం చేసుకుంది. ఫలితాల వివరాలను శ్యామ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ జి.శ్యామ్‌ శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కలిపి 6,014 ఉద్యోగాలకు 4,005 ఉద్యోగాలను తమ సంస్థ కైవసం చేసుకుందన్నారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ కోచింగ్‌ ద్వారా, టెస్ట్‌ సిరీస్‌, మెటీరియల్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అభ్యర్థులు ఈ విజయాన్ని సాధించారని తెలిపారు. ప్రధానంగా సివిల్‌ కానిస్టేబుల్‌ విభాగంలో 168/200 మార్కులతో విశాఖపట్నానికి చెందిన జి.నానాజీ (రి.నెం.4434322) రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడని చెప్పారు. మహిళల విభాగంలో 159/200 మార్కులతో విజయనగరానికి చెందిన జి.రమ్యమాధురి (రి.నెం.4318582) రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఏపీఎస్పీ విభాగంలో 144.5/200 మార్కులతో విశాఖపట్నానికి చెందిన ఎం.అచ్యుతరావు (రి.నెం.4008213) ప్రథమ ర్యాంకు సాధించినట్టు శ్యామ్‌ వెల్లడించారు.

Updated Date - Aug 02 , 2025 | 06:43 AM