Share News

కుంటనహాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:56 PM

మండలంలోని కుంటనహాల్‌ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌తో కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.

   కుంటనహాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌
ప్రమాదంలో కాలిపోయిన సర్టిఫికెట్లు

గాలిబూడిదైన ఇంట్లోని వస్తువులు

కౌతాళం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కుంటనహాల్‌ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌తో కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన రఫిక్‌ శనివారం తమ బంధువులను పలకరించేందుకు కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పకు కుటుంబంతో కలిసి వెళ్లారు. అయితే ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో విద్యుత షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి పక్కల వారు ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. తలుపులు తీసి చూడాలి ఆయన చెప్పడంతో ఇంటి పక్కల వారు తలుపులు పగలగొట్టి చూడగా ఇంటి మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. అందులో వస్తువులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యారు. వెంటనే కరెంటు సరఫరాను నిలిపివేసి నీటితో మంటలను ఆర్పివేశారు. సమాచారం తెలుసుకున్న రఫీ హుటాహుటినా స్వగ్రామానికి చేరుకున్నారు. ఇటీవల మిరప పంటను అమ్మగా వచ్చిన నగదు రూ.1.30 లక్షలు బీరువాలో ఉంచానని, అలాగే రిఫ్రిజిరేటర్‌, బీరువాలో ఉన్న బట్టలతో పాటు పిల్లల చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం రూ.4 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

Updated Date - Mar 16 , 2025 | 11:56 PM