వణికిస్తున్న చలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:18 PM
నల్లమల అటవీ సమీప ప్రాంతమైన ఆత్మకూరు డివిజనలో చలి వణికిస్తుంది.
ఈదురుగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
వణుకుతున్న గిరిజనగూడేలు
ఆత్మకూరు, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నల్లమల అటవీ సమీప ప్రాంతమైన ఆత్మకూరు డివిజనలో చలి వణికిస్తుంది. ఈదురుగాలులతో పగటివేళల్లో సైతం జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 8గంటల వరకు ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. ఆత్మకూరు పట్టణంలో తెల్లవారుజామున సుమారు 13 నుంచి 15 డిగ్రీల వరకు చలితీవ్రత వుంది. అలాగే సాయంత్రం 6గంటల నుంచే చలి ప్రభావం పూర్తిస్థాయిలో వుండటంతో ప్రజలు రాత్రి 9గంటల్లోగానే ఇళ్లకు చేరుతున్నారు. దీంతో రహ దారులపై కూడా జన సంచారం తగ్గు ముఖం పట్టింది. నల్లమల అడవు లు దగ్గరలో వుండటంతో పాటు సమీపంలోనే కృష్ణానది ప్రవహిస్తుండ టం తో చలి తీవ్రత పెరిగినట్లు ప్రజలు చర్చించుకుం టున్నారు. చలి తీవ్రత పెరగడంతో చిన్నారు లు, వృద్ధులు అల్లాడి పోతున్నారు. స్పెట్టర్లు, కూల్ క్రీమ్‌లు, కొబ్బరి నూనె లాంటి వాటితో కొంత మేర చలి నుంచి శరీరాన్ని రక్షిం చు కుంటు ఉపశమ నం పొందుతు న్నా రు. ఇదిలావుండగా ఉబ్బసం, ఊపిరి తిత్తులతో బాధపడే వ్యాధిగ్రస్థులు చలి తీవ్రతతో అవస్థలు పడుతున్నారు.
గూడేలవాసులకు తిప్పలు
నల్లమల అటవీ సమీప గిరిజన గూడేలవాసులు చలిపులితో వణికిపోతు న్నారు. అడవుల్లో మంచు కురియడం తో చెంచులు సైతం కునారిల్లుతు న్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు గూడేల్లో జనజీనవం కూడా ఇబ్బందిగా సాగుతోంది. అలాగే నల్లమల సమీప గ్రామాలు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలావుంటే నల్లమల అడవుల్లో జీవనం సాగించే వన్యప్రాణులకు చలి ప్రభావం వణికిస్తోంది.
రాకపోకలకు అంతరాయం
నల్లమల అడవుల గుండా సాగే రహదారులు కూడా మంచుతో కప్పబడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. కర్నూలు నుంచి విజయవాడ, ఒంగోల్, మార్కాపురం, చీరాల, రాజమండ్రి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు చేరుకునే వాహనాలు నల్లమల ఘాట్‌రోడ్లపై మంచుకప్పబడి వుండటంతో రాత్రివేళల్లో రవాణా ఇబ్బందిగా మారింది. వేగం తగ్గించుకుని ఫోక్సింగ్ లైట్ల సహాయంతోప్రయాణాలను సాగిస్తున్నారు. ఏదిఏమైనా.. చలితీవ్రత ఎప్పటికీ తగ్గుముఖం పడుతుందోనని జనం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.