Share News

CPI Protests: షిరిడీ సాయికి దోచిపెట్టేందుకే విద్యుత్‌ భారాలు

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:26 AM

షిరిడీ సాయి కంపెనీ కి దోచిపెట్టేందుకే ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ భారాలను మోపుతోందని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు.

 CPI Protests: షిరిడీ సాయికి దోచిపెట్టేందుకే విద్యుత్‌ భారాలు

  • అదానీ విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి

  • పోలవరం నిర్వాసితుల కోసం ఉద్యమం: సీపీఐ రామకృష్ణ

విజయవాడ(ధర్నాచౌక్‌), చింతలపూడి, జూలై 5(ఆంధ్రజ్యోతి): షిరిడీ సాయి కంపెనీ కి దోచిపెట్టేందుకే ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ భారాలను మోపుతోందని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. సర్దుబాటు చార్జీల పేరుతో పెంచిన విద్యుత్‌ భారాన్ని తగ్గించాలని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, అదానీతో జరిగిన విద్యుత్‌ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. రామకృష్ణ మాట్లాడుతూ... విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రూ.15,400 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Updated Date - Jul 06 , 2025 | 03:28 AM