శర్మిష్ఠ సేవలు వెలకట్టలేనివి
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:32 AM
కరోనా సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ శర్మిష్ఠ చేసిన సేవలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాచర్ల సుహాసిని అన్నారు. ఆదివారం జిల్లాకోర్టు సెంటర్‌లోని ఒక సమావేశపు హాలులో డాక్టర్ శర్మిష్ఠ ఉద్యోగ విరమణ సభ నిర్వహించారు.
- ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాచర్ల సుహాసిని
- ఘనంగా కృష్ణాజిల్లా డీఎంఅండ్‌హెచ్‌వో ఉద్యోగ విరమణ సభ
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ శర్మిష్ఠ చేసిన సేవలు వెలకట్టలేనివని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మాచర్ల సుహాసిని అన్నారు. ఆదివారం జిల్లాకోర్టు సెంటర్‌లోని ఒక సమావేశపు హాలులో డాక్టర్ శర్మిష్ఠ ఉద్యోగ విరమణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుహాసిన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పలువురు వైద్యులు సేవలందించారని, వారిలో శర్మిష్ఠ ఒకరని గుర్తు చేసుకున్నారు. వైద్యశాఖలో శర్మిష్ఠ 38 ఏళ్ల పాటు అంకితభావంతో పనిచేశారని తెలిపారు. అనంతరం శర్మిష్ఠ, చిత్తజల్లు సాయిప్రసాద్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అమృతం పాల్గొన్నారు.
ఇన్‌చార్జి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా అంబటి
కృష్ణాజిల్లా ఇన్‌చార్జి వైద్య ఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ అంబటి వెంకట్రావు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పనిచేసిన డాక్టర్ సి.ఎస్.శర్మిష్ఠ ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో జిల్లా టీబీ, ఎయిడ్స్, కుష్టువ్యాధి నివారణాధికారి డాక్టర్ అంబటి వెంకట్రావును జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.