Share News

YS Sharmila: తుస్సుమన్న మోదీ టపాసు

ABN , Publish Date - Oct 18 , 2025 | 06:29 AM

ర్నూలు వేదికగా ప్రధాని మోదీ పేల్చిన టపాసు తుస్సుమందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

YS Sharmila: తుస్సుమన్న మోదీ టపాసు

  • బిహార్‌ ఎన్నికల కోసం మల్లన్న పేరుతో నీచ రాజకీయం: షర్మిల

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): కర్నూలు వేదికగా ప్రధాని మోదీ పేల్చిన టపాసు తుస్సుమందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. శుక్రవారం ఈమేరకు ఆమె ఒక ప్రకటన చేశారు. ‘వచ్చింది ఏపీకి... వేసింది బిహార్‌ ఎన్నికల కోసం కాషాయ వేషం. కేవలం ఆ ఎన్నికలను ప్రభావితం చేయడానికే శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయానికి తెరలేపారు. శ్రీశైలం మల్లన్న క్షేత్ర అభివృద్ధి కోసం ఎలాంటి ప్రకటన చేయలేదు. రూ.1,657కోట్లతో పెండింగ్‌లో ఉన్న మాస్టర్‌ ప్లాన్‌ మోదీకి కనబడలేదా? ఉజ్జయిని, వారాణసీ, గంగానది కారిడార్ల అభివృద్ధిపై చూపిన ప్రేమ శ్రీశైలంపై చూపించకపోవడం వివక్ష ప్రదర్శించడమే. ప్రత్యేక హోదాపై మోదీ నోరెందుకు విప్పలేదు? వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి నిధుల ఊసేలేదు. వినేవాడుంటే చెప్పేవాడు మోదీ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది’ అని షర్మిల విమర్శించారు.

Updated Date - Oct 18 , 2025 | 06:29 AM