Share News

విద్యుత్‌ చార్జీలపై కూటమి తీరు ఆక్షేపణీయం: షర్మిల

ABN , Publish Date - Dec 12 , 2025 | 06:33 AM

విద్యుత్‌ చార్జీలపై చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులు అనే రీతిలో కూటమి ప్రభుత్వం తీరు...

విద్యుత్‌ చార్జీలపై కూటమి తీరు ఆక్షేపణీయం: షర్మిల

విజయవాడ సిటీ, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలపై చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులు అనే రీతిలో కూటమి ప్రభుత్వం తీరు ఉందని పీసీసీ చీఫ్‌ షర్మిల ఎద్దేవా చేశారు. గురువారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఏపీఈఆర్‌సీ ప్రతిపాదనలకు, సీఎం చంద్రబాబు హామీలకు పొంతన లేదు. రూ.15,651 కోట్ల చార్జీల వడ్డనకు కమిషన్‌ సర్వం సిద్ధం చేస్తుంటే... చార్జీల భారం పడదని చంద్రబాబు చెప్పే మాటలు పాత చింతకాయ పచ్చడితో సమానం. అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోపే జనాలకు సర్దుబాటు పేరుతో గుండెపోటు రప్పించారు. ట్రూ అప్‌ బిల్లుల పేరుతో రూ.15 వేల కోట్లు జనాల జేబులకు చిల్లులు పెటారు. ఇప్పుడు మరో రూ.15 వేల కోట్లను టైం ఆఫ్‌ ది డే పేరుతో దోచుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఏడాదికో హై టెన్షన్‌ షాక్‌ ఇస్తున్నారు’ అని మండిపడ్డారు. 

Updated Date - Dec 12 , 2025 | 06:34 AM