ఆరోగ్యశ్రీని చంపేస్తున్న రాక్షసుడు బాబు: షర్మిల
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:03 AM
ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు వైఎ్‌సఆర్ దేవుడైతే.. పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడు అవుతున్నాడని పీసీసీ చీఫ్ షర్మిల...
విజయవాడ(వన్‌టౌన్), అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేదలకు వైఎ్‌సఆర్ దేవుడైతే.. పథకాన్ని నిర్వీర్యం చేస్తూ సీఎం చంద్రబాబు రాక్షసుడు అవుతున్నాడని పీసీసీ చీఫ్ షర్మిల శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శలు గుప్పించారు. ప్రైవేటు ఆరోగ్య బీమా ముసుగులో.. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా చంపేస్తున్నారని పేర్కొన్నారు. ‘రూ.2,700 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టడం ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగం. నెట్‌వర్క్ ఆస్పత్రులు నెల రోజులుగా ఓపీ సేవలు నిలిపివేసినా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దారుణం. ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా అన్నారు. ఇప్పుడు 10 శాతానికి కుదించి రూ.2.5 లక్షల ప్రయివేటు బీమాతో సరిపెట్టారు.’ అని విమర్శించారు.