అన్నదాతకు చంద్రబాబు ఇచ్చేది 14 వేలే: షర్మిల
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:51 AM
: అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్రం ఇచ్చే రూ.6,000 తీసేస్తే చంద్రబాబు ఇచ్చేది రూ.14,000 మాత్రమే అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
అమరావతి, ఆగస్టు 1(అమరావతి): అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్రం ఇచ్చే రూ.6,000 తీసేస్తే చంద్రబాబు ఇచ్చేది రూ.14,000 మాత్రమే అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే రూ.20,000 ఇస్తామని ప్రకటించి... తీరా ఎన్నికల్లో గెలిచాక కేవలం రూ.14.000 ఇవ్వడం ఏమిటి? అని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆమె, సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. అన్నదాత సుఖీభవలో 30 లక్షల మంది రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తల్లికి వందనంలో 20 లక్షల మంది తల్లులకు, గ్యాస్ సిలెండర్ పథకంలో సగం మంది మహిళలకు ఎగనామం పెట్టారన్నారు. సూపర్ సిక్స్ హామీల అర్హులందరికీ పథకాలను ఇవ్వకుండా సగం మందికి ఎత్తేస్తున్నారని ఆరోపించారు.