Weather Alert: అండమాన్‌లో తీవ్ర అల్పపీడనం
ABN , Publish Date - Nov 24 , 2025 | 06:06 AM
మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా బలపడి అక్కడే కొనసాగుతోంది.
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
విశాఖపట్నం/అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మలక్కా జలసంధి, దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా బలపడి అక్కడే కొనసాగుతోంది. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా, 27వ తేదీకల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడనుంది. సముద్రంలోనే బలహీనపడుతుందని కొందరు నిపుణులు చెబుతుండగా, మరికొన్ని మోడళ్ల మేరకు దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని అంచనావేశారు. ఇదిలావుండగా శ్రీలంక సమీప కామరూన్, నైరుతి బంగాళాఖాతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పనుంది.