Guntur People Health: గుంటూరులో ప్రబలిన అతిసార
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:17 AM
గుంటూరు నగరంలో అతిసార ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పెద్దసంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వర్షాల వల్ల తాగు నీటి వనరులు...
ప్రభుత్వాస్పత్రిలో చేరిన 32 మంది.. ప్రైవేటు వైద్యశాలల్లో మరికొందరు
గుంటూరు మెడికల్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో అతిసార ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పెద్దసంఖ్యలో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వర్షాల వల్ల తాగు నీటి వనరులు కలుషితమవ్వడమే దీనికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. సంగడిగుంట, పాతగుంటూరు, ఆర్టీసీ కాలనీ, రెడ్లబజార్, బుచ్చయ్య తోట, నల్లచెరువు, రెడ్డిపాలెం నుంచి 32 మంది బాధితులు బుధవారం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేరారు. కొందరు ప్రైవేటు వైద్యశాలల్లో, మరికొందరు ఇళ్లల్లోనే చికిత్సలు పొందుతున్నారు. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రభుత్వాస్పత్రికి వచ్చి రోగులను పరామర్శించారు. తక్కెళ్లపాడు వాటర్ హెడ్స్ నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్ల వద్ద శుద్ధి చేస్తామని, ఇళ్లకు సరఫరాలో అయ్యాక శాంపిల్స్ తీసుకుంటామని చెప్పారు. వర్షాల కారణంగా నీరు కలుషితమై ఉంటుందని, ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.