Weather: కొనసాగిన చలి తీవ్రత
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:44 AM
కోస్తా, రాయలసీమల్లో శుక్రవారం అనేక చోట్ల చలి తీవ్రత కొనసాగింది. తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు...
జి.మాడుగులలో 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
17, 18 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు
విశాఖపట్నం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): కోస్తా, రాయలసీమల్లో శుక్రవారం అనేక చోట్ల చలి తీవ్రత కొనసాగింది. తెలంగాణకు ఆనుకుని ఉన్న కోస్తా, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు కురిసింది. అల్లూరి జిల్లాలోని జి.మాడుగులలో ఆరు డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం రెండు రోజుల్లో తమిళనాడు వైపు రానుందని, దీని ప్రభావంతో 17, 18 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.