Municipal Commissioners Transfers: పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీ
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:33 AM
పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌ను పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించి...
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): పలువురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌ను పార్వతీపురం మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించి... అక్కడ పనిచేస్తున్న కిశోర్ కుమార్‌ను సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని సూచించారు. నరసాపూర్ మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్యను అనంతపురం డిప్యూటీ కమిషనర్‌గాను, పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఆర్.వెంకట్రామిరెడ్డిని నరసాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. టిడ్కో జనరల్ మేనేజర్‌గా ఉన్న ఆర్‌డీఎంఏ యు.శారదాదేవిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్‌గాను, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ డి.కొండయ్యను పెడన కమిషనర్‌గాను, పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ఎం.మంజునాఽథ్ గౌడ్‌ను ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్‌గాను, వెయిటింగ్‌లో ఉన్న డేనియల్ జోసెఫ్ చీరాల మున్సిపల్ కమిషనర్‌గాను, అక్కడ ఉన్న కమిషనర్ అబ్దుల్ రషీద్‌ను సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటరీ సూపర్‌వైజర్‌గా ఉన్న లక్ష్మినారాయణను రాజంపేట మున్సిపల్ కమిషనర్‌గా నియమించి అక్కడ పనిచేస్తున్న జి.శ్రీనివాసులను కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. జీవీఎంసీ జోన్-1(భీమిలి)లో మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న నాయుడును జోన్-2కు(మధురవాడ) మారుస్తూ ఆదేశాలిచ్చారు. వెంకటగిరి మున్సిపాలిటీ కమిషనర్‌గా ఉన్న జి.వెంకట్రామిరెడ్డిని నందికొట్కూరు మున్సిపాలిటీకి బదిలీ చేసి అక్కడ పనిచేస్తున్న ఎస్.బేబీని సీడీఎంఏకు రిపోర్ట్ చేయాలని, వెయిటింగ్‌లో ఉన్న రెవెన్యూ అధికారి పి.శ్రీధర్‌ను కనిగిరి మున్సిపాలిటీ కమిషనర్‌గా నియమించారు.