Endowments Department: దేవదాయ శాఖలో 7 పోస్టులకు నోటిఫికేషన్
ABN , Publish Date - Aug 17 , 2025 | 06:18 AM
దేవదాయ శాఖలో ఏడు గ్రేడ్-3 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖలో పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండటంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది.
127 పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టని అధికారులు
అమరావతి, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖలో ఏడు గ్రేడ్-3 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శాఖలో పెద్దసంఖ్యలో ఖాళీలు ఉండటంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ జూనియర్ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటితోపాటు డిప్యూటీ కమిషనర్ పోస్టులు 6, అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు 5, గ్రేడ్-1 ఈవో పోస్టులు 12, గ్రేడ్-3 ఈవో పోస్టులు 104 కలిపి మొత్తం 127 ఖాళీలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సమీక్షలో ఖాళీ పోస్టులు భర్తీ వెంటనే చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయినప్పటికీ దేవదాయ, ఆర్థిక శాఖ అధికారులు ఏడాది పాటు ఫైల్‌ను అటూ, ఇటూ తిప్పి చివరికి ఏడు గ్రేడ్-3 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. మిగిలిన ఖాళీల ఊసే ఎత్తడం లేదు.