లింగ వివక్షపై పోరాటం: సెర్ప్
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:13 AM
లింగ వివక్షపై పోరాటం, స్త్రీ-పురుష సమానత్వం ఆవశ్యకతపై పౌరుల్లో అవగాహన పెంచడం నయీ చేతన జాతీయ జెండర్ క్యాంపైన్-4.0 ముఖ్య ఉద్దేశం అని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు.
నయీ చేతన-4.0 పోస్టర్ల ఆవిష్కరణ
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): లింగ వివక్షపై పోరాటం, స్త్రీ-పురుష సమానత్వం ఆవశ్యకతపై పౌరుల్లో అవగాహన పెంచడం నయీ చేతన జాతీయ జెండర్ క్యాంపైన్-4.0 ముఖ్య ఉద్దేశం అని సెర్ప్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. మంగళవారం సెర్ప్ రాష్ట్ర కార్యాలయంలో నయీ చేతన-4.0 జెండర్ క్యాంపైన్ ప్రచార పోస్టర్లను, ప్రచార సామగ్రిని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లింగ వివక్షను తగ్గించడం లేదా పూర్తిగా రూపుమాపడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంగళవారం నుంచి డిసెంబరు వరకు అన్ని జిల్లాల్లో లింగ వివక్షకు వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్లు, జిల్లా సమాఖ్యలు, హెచ్‌డీ విభాగాలు ఇందులో పాల్గొనాలని ఆదేశించారు. కార్యక్రమంలో సెర్ప్ అదనపు సీఈవో శ్రీరాములునాయుడు, డైరెక్టర్లు సుశీల, కృష్ణమోహన్, కల్యాణచక్రవర్తి, శివశంకరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.