AP Administration: ఎట్టకేలకు ఆంధ్రా కేడర్‌కు శివశంకర్ లోతేటి
ABN , Publish Date - Aug 30 , 2025 | 05:35 AM
సీనియర్ ఐఏఎస్ అధికారి శివ శంకర్ లోతేటి(2013 బ్యాచ్) ని డీవోపీటీ ఎట్టకేలకు ఏపీ కేడర్‌కు కేటాయించింది. ఈ మేరకు డీవోపీటీ అండర్ సెక్రటరీ అశ్వినీ కుమార్ మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
81న విధుల్లో చేరనున్న సీనియర్ ఐఏఎస్
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారి శివ శంకర్ లోతేటి(2013 బ్యాచ్) ని డీవోపీటీ ఎట్టకేలకు ఏపీ కేడర్‌కు కేటాయించింది. ఈ మేరకు డీవోపీటీ అండర్ సెక్రటరీ అశ్వినీ కుమార్ మిశ్రా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన కొంత మంది ఐఏఎస్‌లను డీవోపీటీ వద్ద ఉన్న వివరాల ఆధారంగా తెలంగాణకి కేటాయించింది. శివ శంకర్ లోతేటి ఏపీకి చెందిన వ్యక్తి అయినా, కొన్ని సాంకేతిక కారణాలతో విభజన సమయంలో డీవోపీటి ఆయనను తెలంగాణ కు కేటాయించింది. 2024లో తెలంగాణలో రిపోర్టు చేసిన ఆయన, తనను ఏపీకి పంపించాలని క్యాట్‌ను, హైకోర్టును ఆశ్రయించగా ఇప్పుడు ఆయనకు సానుకూలంగా తీర్పులు వెలువడ్డాయి. ఆయన సోమవారం ఏపీలో చేరనున్నారు.