Share News

AP Bhavan: ఏపీభవన్‌ ఆర్సీగా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు

ABN , Publish Date - Sep 30 , 2025 | 06:08 AM

ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌(ఆర్సీ)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు.

AP Bhavan: ఏపీభవన్‌ ఆర్సీగా ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌(ఆర్సీ)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆయన సోమవారం ఏపీభవన్‌లో మాజీ ఆర్సీ సౌరభ్‌గౌర్‌ నుంచి చార్జ్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ను సౌరభ్‌గౌర్‌తోపాటు స్పెషల్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌, డిప్యూటీ కమిషనర్‌ ఎన్వీ రామారావు, కదిరి మోహన ప్రభాకర్‌ అభినందించారు.

Updated Date - Sep 30 , 2025 | 06:09 AM