General Council Member: డీఎస్ఎన్‌ఎల్‌యూ జనరల్ కౌన్సిల్ సభ్యునిగా సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు
ABN , Publish Date - Aug 09 , 2025 | 05:18 AM
విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్‌ఎల్‌యూ) జనరల్ కౌన్సిల్ సభ్యునిగా సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణ రావు నియమితులయ్యారు.
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్‌ఎల్‌యూ) జనరల్ కౌన్సిల్ సభ్యునిగా సీనియర్ న్యాయవాది బి ఆదినారాయణ రావు నియమితులయ్యారు.హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, డీఎస్ఎన్‌ఎల్‌యూ చాన్స్‌లర్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్...సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావును జనరల్ కౌన్సిల్ సభ్యునిగా నామినేట్ చేస్తూ ఈ నెల 6న ప్రొసీడింగ్స్ జారీచేశారు.జనరల్ కౌన్సిల్ సభ్యునిగా నియమితులైన ఆదినారాయణరావుకు డీఎస్ఎన్‌ఎల్‌యూ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ డి. సూర్యప్రకాశరావు అభినందనలు తెలిపారు.
1979లో న్యాయవాదిగా మొదలై..
సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్వగ్రామం ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్ల. 1979లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన ఆయన 1979-82 వరకు బాపట్లలోనే ప్రాక్టీస్ చేశారు. 1982లో ఏపీ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.1990లో బార్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 1996-2000 మధ్య హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు.2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందిన ఆదినారాయణరావు.. 2013 నుంచి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు.రాజ్యాంగ సంబంధ కేసులతోపాటు క్రిమినల్, సివిల్, ఎన్నికలు, సర్వీసు, మధ్యవర్తిత్వం తదితర కేసులు వాదించడంలో ఆయనకు అపార అనుభవం ఉంది.