వ్యవసాయ సహకార సంఘాలకు చైర్మన్ల ఎంపిక
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:26 PM
ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘాలకు (పీఏసీఎస్) ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను ఎంపిక చేసింది.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రెండు సొసైటీలు
ఆదోని నియోజకవర్గంలో మూడు సొసైటీలకు త్రిసభ్య కమిటీలు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కర్నూలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల్లో ప్రాథమిక వ్యవసాయ పరస్పర సహకార సంఘాలకు (పీఏసీఎస్) ప్రభుత్వం త్రిసభ్య కమిటీలను ఎంపిక చేసింది. శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డీసీఓ వెంకటకృష్ణ, కేడీసీసీబీ సీఈఓ రామాంజనేయులు తెలిపారు. ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల పీఏసీఎస్ సొసైటీ చైర్మనగా కడిమెట్ల విరుపాక్షిరెడ్డి, సభ్యులుగా రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన కాపు మురళికృష్ణారెడ్డిని, కడిమెట్లకు చెందిన బి.కేశన్నను నియమించారు. గోనెగండ్ల పీఏసీఎస్ సొసైటీ చైర్మనగా అదే గ్రామానికి చెందిన ఎన్వీ రామాంజనేయులు, సభ్యులుగా కడపల రమేశ, కురవ వెంకటేశ్వర్లును ఎంపిక చేశారు. ఆదోని నియోజకవర్గం పరిధిలో మదిరె పీఏసీఎస్ సొసైటీ చైర్మనగా మండగిరికి చెందిన ఎం. ఆమోధర్ చౌదరి, సభ్యులుగా ఇస్వీ గ్రామానికి చెందిన దూదేకుల మగ్దుమ్ బాషా, సంగిపోగుల లక్ష్మమ్మ, పెద్దతుంబళం పీఏసీఎస్ సొసైటీ చైర్మనగా వి. అన్వర్‌బాషా, సభ్యులుగా కొరవన్నగారి బసన్న, ఈడిగి శంకరప్పలను, పెద్ద హరివాణం ఏపీసీఎస్ సొసైటీ చైర్మనగా బి. ఆదిశేషిరెడ్డి, సభ్యులుగా తుంబలం గోవిందప్ప, సయ్యద్ బాషాలను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదోని నియోజకవర్గంలో మూడు సొసైటీలకు టీడీపీ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు ప్రతిపాదించిన వాళ్లనే ప్రభుత్వం నియమించింది.