సచివాలయ సిబ్బంది ఇష్టారాజ్యం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:23 PM
పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలోని 5వ సచివాలయంలో సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.
కార్యాలయంలో జవాబుదారీతనం కరువు
ఆత్మకూరు, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలోని 5వ సచివాలయంలో సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. మంగళవారం ఉదయం ఓ వ్యక్తి తన కుమారుడికి వ్యాక్సిన వేయించేందుకు సచివాలయానికి వెళ్లి అక్కడున్న ఓ ఉద్యోగిని ఏఎనఎం ఎప్పుడు అందుబాటులో ఉంటారని సమాచారాన్ని కోరగా ఇందుకు సదరు ఉద్యోగి ఎలాంటి జవాబుదారితనం లేకుండా తమకు తెలియదని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మధ్యాహ్నం మరోసారి సచివాలయానికి వెళ్తే అక్కడ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పాటు ఖాళీ కుర్చీలను చూసి ఆ వ్యక్తి అవా క్కయ్యాడు. విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ప్రజలకు ప్రభు త్వ సేవలను మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేస్తే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడేలా చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా.. మున్సి పాలిటీ అధికారులు సచివాలయల పట్ల పర్యవేక్షణ మెరుగుపరిచి ప్రజలకు మెరు గైన సేవలు అందించాలని ఆశిద్దాం. ఈ విషయంపై మున్సిపల్ మేనేజర్ రవికుమా ర్‌ను వివరణ కోరగా బాధితుడు తనకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సచివాలయా న్ని సందర్శించి అక్కడ సిబ్బందిని విచారించామన్నారు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేయకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించినట్లు తెలిపారు.