Guntur: 10న సచివాలయ ఉద్యోగుల బెజవాడ మార్చ్
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:45 AM
రాష్ట్రంలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో అక్టోబరు 10న బెజవాడ మార్చ్ నిర్వహించనున్నట్టు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం...
గుంటూరు సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో అక్టోబరు 10న బెజవాడ మార్చ్ నిర్వహించనున్నట్టు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ వెల్లడించారు. గుంటూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ వలంటీర్ల విధుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు విముక్తి కల్పించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అన్నారు. సచివాలయం ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేయటంతో పాటు, నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని, బదిలీల కోసం పారదర్శక విధానం తీసుకురావాలన్న డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.