Higher Education Council: రెండో విడత డిగ్రీ అడ్మిషన్లకు షెడ్యూలు
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:57 AM
రెండో విడత డిగ్రీ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి బుధవారం షెడ్యూలు జారీచేసింది. ఈ నెల 26 నుంచి 29 వరకు విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని...
అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రెండో విడత డిగ్రీ అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి బుధవారం షెడ్యూలు జారీచేసింది. ఈ నెల 26 నుంచి 29 వరకు విద్యార్థులు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, 27 నుంచి 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, 29 నుంచి 1 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. 3న ఆప్షన్లు మార్చుకోవచ్చని, 6న సీట్లు కేటాయింపు జరుగుతుందని పేర్కొంది. 7, 8 తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించింది. కాగా, తొలి విడతలో 1,30,265 మందికి సీట్లు కేటాయించారు. వారిలో 1,22,955 మంది విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేశారు. ఇంకా 7,310 మంది రిపోర్టు చేయాల్సి ఉంది. వారిలో సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయనివారు ఇప్పుడు అప్‌లోడ్ చేస్తే వారికి రెండో విడతలో సీట్లు కేటాయిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.