Share News

10 లక్షల మందికి రేపు రెండో విడత తల్లికి వందనం

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:40 AM

రెండో విడత తల్లికి వందనం నిధులను ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో లబ్ధి పొందనున్నారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి.

10 లక్షల మందికి రేపు రెండో విడత తల్లికి వందనం

అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రెండో విడత తల్లికి వందనం నిధులను ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు రెండో విడతలో లబ్ధి పొందనున్నారు. ఒకటో తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి. అలాగే మొదటి విడతలో అర్హుల జాబితాలో ఉన్నా ఒకే కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నవారు, ఆధార్‌ నంబర్లు సరిగా నమోదుచేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగ్‌లో ఉంచారు. వారికి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు. విద్యాహక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన 46 వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు. మొత్తం 11 లక్షల మంది వివరాలను పాఠశాల విద్యాశాఖ సచివాలయాల శాఖకు పంపింది. అర్హతల వడపోత అనంతరం సుమారు 10 లక్షల మందికి పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 05:41 AM