బడులకు దసరా సెలవులు22 నుంచే: లోకేశ్
ABN , Publish Date - Sep 20 , 2025 | 05:49 AM
పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 22 నుంచి ఇవ్వనున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్ర జ్యోతి): పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 22 నుంచి ఇవ్వనున్నట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. సెలవులపై ఉపాధ్యాయుల విజ్ఞప్తులను టీడీపీ పట్టభద్ర ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై విద్యాశాఖ అధికారులతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అక్టోబరు 2 వరకు దసరా సెలవులు ఉంటాయన్నారు. విద్యా క్యాలండర్ ప్రకారం ఈనెల 24 నుంచి దసరా సెలవులు ఇవ్వాల్సి ఉంది. కానీ 22 నుంచే శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నందున ఆ రోజు నుంచే సెలవులు ప్రారంభించాలని టీచర్లు కోరుతూ వచ్చిన నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు.