Share News

School Bus Driver: విద్యార్థులను క్షేమంగా ఉంచి.. తాను తనువు చాలించి..

ABN , Publish Date - Nov 03 , 2025 | 07:07 AM

హఠాత్తుగా ముంచుకొచ్చిన గుండెనొప్పితో అప్రమత్తమైన ఆ డ్రైవర్‌ విద్యార్థులను క్షేమంగా ఉంచి, తాను ప్రాణాలు ఒదిలాడు.

School Bus Driver: విద్యార్థులను క్షేమంగా ఉంచి.. తాను తనువు చాలించి..

  • స్కూల్‌ బస్సు నడుపుతుండగా గుండెపోటు

  • రోడ్డు పక్కన ఆపి సీట్లోనే కుప్పకూలిన డ్రైవర్‌

40 మంది విద్యార్థులు క్షేమం ఇంకొల్లు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హఠాత్తుగా ముంచుకొచ్చిన గుండెనొప్పితో అప్రమత్తమైన ఆ డ్రైవర్‌ విద్యార్థులను క్షేమంగా ఉంచి, తాను ప్రాణాలు ఒదిలాడు. బాపట్ల జిల్లా ఇంకొల్లులోని శివబ్రహ్మకాలనీకి చెందిన శెట్టిపల్లి నాగరాజు (67) కొంతకాలంగా పూసపాడు అడ్డరోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌ బస్సుకు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. శనివారం సాయంత్రం స్కూల్‌ ముగిసిన అనంతరం బస్సులో సుమారు 40 మంది విద్యార్థులను ఎక్కించుకొని బయల్దేరారు. దగ్గుబాడు-నాయుడువారిపాలెం మధ్యకు రాగానే ఛాతీనొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన నిలిపారు. అనంతరం సీట్లోనే నాగరాజు కుప్పకూలారు. ఇంకొల్లులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Updated Date - Nov 03 , 2025 | 07:09 AM