Higher Education Council: లా, బీఈడీ, బీపీఈడీ అడ్మిషన్లకు షెడ్యూలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:29 AM
న్యాయ, బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి శనివారం షెడ్యూలు విడుదల చేసింది. న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నోటిఫికేషన్...
విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి
అమరావతి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): న్యాయ, బీఈడీ, బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి శనివారం షెడ్యూలు విడుదల చేసింది. న్యాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నోటిఫికేషన్ ప్రచురిస్తామని 8 నుంచి 11 వరకు రిజిస్ర్టేషన్ చేసుకోవాలని సూచించింది. 12 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లకు గడువు ఉంటుందని, 17న సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించింది. బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు 9 నుంచి 12 వరకు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, 13 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని, 16న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని, 18న సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొంది. ఇక బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు 10 నుంచి 13 వరకు రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చని, 14 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, 17న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని, 19న సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపింది.