Share News

Minister Dola: నర్సింగ్‌ చదివిన ఎస్సీ యువతకు జర్మన్‌ భాషపై శిక్షణ

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:06 AM

నర్సింగ్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మన్‌ భాష నేర్చుకునేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా....

Minister Dola: నర్సింగ్‌ చదివిన ఎస్సీ యువతకు జర్మన్‌ భాషపై శిక్షణ

  • జర్మనీలో వారికి ఉపాధి కల్పిస్తాం: రాష్ట్ర మంత్రి డోలా

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): నర్సింగ్‌, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) చదివిన ఎస్సీ నిరుద్యోగ యువతకు జర్మన్‌ భాష నేర్చుకునేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇచ్చి అనంతరం వారికి జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉచితంగా వారికి జర్మన్‌ భాష శిక్షణ ఇస్తామన్నారు. ఎస్సీ యువత ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఎస్సీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మరింత బలోపేతం చేసేందుకు సీఎం పాటుపడుతున్నారని మంత్రి చెప్పారు.

Updated Date - Jul 12 , 2025 | 09:41 AM