Minister TG Bharat: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల నిరసన విరమణ
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:00 AM
తమకు రావాల్సిన ప్రోత్సాహకాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా చేస్తున్న దీక్షను ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు విరమించారు.
అమరావతి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): తమకు రావాల్సిన ప్రోత్సాహకాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా చేస్తున్న దీక్షను ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు విరమించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గురువారం తన కార్యాలయంలో వారి జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సీఎంతో చర్చించామని, క్రిస్మస్ లేదా సంక్రాంతి నాటికి ప్రోత్సాహకాల నిధులు పూర్తిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఐఐసీ భవన్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న పారిశ్రామికవేత్తలతో కూడా మంత్రి చర్చలు జరిపారు.