Satyakumar: కూటమిది చరిత్రాత్మక విజయం
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:20 AM
బుధవారం ఆయన ప్రజలకు ఒక లేఖ రాశారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించిన ప్రజల మనోభావం వెల్లడైన రోజు. జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఏకగీవ్రంగా గళమెత్తిన రోజు.
‘గత ఐదేళ్ల అరాచకం, అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు మూకుమ్మడిగా 2024, జూన్ 4 ఓ చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. బుధవారం ఆయన ప్రజలకు ఒక లేఖ రాశారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించిన ప్రజల మనోభావం వెల్లడైన రోజు. జగన్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు ఏకగీవ్రంగా గళమెత్తిన రోజు. రాజ్యాంగ ప్రసాదితమైన ప్రాథమిక హక్కులు... స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు ప్రజలు పట్టం కట్టిన పవిత్ర దినం. అలాంటి పవిత్ర దినాన్ని వెన్నుపోటు రోజుగా ప్రకటించిన జగన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానించి తన మానసిక వికారాన్ని మరోసారి వెల్లడించుకున్నారు. ప్రజలు గమనించాలి. రాష్ట్రంలో మరోసారి అంధకారానికి ఏమాత్రం తావివ్వకూడదు’ అని కోరారు.