Sathya Sai Commemorative: వెబ్‌సైట్‌లో సత్యసాయి స్మారక నాణెం
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:55 AM
సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సత్యసాయి స్మారక....
పుట్టపర్తి రూరల్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సత్యసాయి స్మారక రూ.100 నాణేన్ని సొంతం చేసుకోవాలని భక్తులు ఆరాటపడుతున్నారు. అయితే ఈ నాణేన్ని ఎక్కడ, ఎలా..? పొందాలని వివిధ బ్యాంకుల్లో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నాణేలను ప్రభుత్వ అధికారిక www.indiagovtmint.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని బ్యాంకు అధికారులు తెలిపారు. నాణెం ధర, ఇతర వివరాలు ఆన్‌లైన్‌లోనే తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.