Puttaparthi: నేటి నుంచి సత్యసాయి శతజయంత్యుత్సవాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 04:57 AM
శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
తొలి రోజు నుంచే నారాయణ సేవ
పుట్టపర్తికి పెరిగిన భక్తుల తాకిడి
వేడుకలకు హాజరుకానున్న రాష్ట్రపతి, ప్రధాని
పుట్టపర్తి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకల్లో పాల్గొనే భక్తులకు నారాయణసేవను తొలిరోజు నుంచే ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం నవంబరు 18 నుంచి జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ శత జయంతిని పురస్కరించుకుని ఈసారి ఐదు రోజుల ముందే వేడుకలను ప్రారంభిస్తున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ గురువారం ప్రశాంతి నిలయంలో నారాయణ సేవను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో ప్రశాంతి నిలయంలోనే గాక వేర్వేరు ప్రాంతాల్లో నారాయణ సేవను అందించనున్నారు. 18వ తేదీన సత్యసాయి రథోత్సవం, 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. 20, 21 తేదీలలో అంతార్జాతీయ శాంతి సమ్మేళనాలు, 22న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవం, 23న సత్యసాయి శత జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, 22న ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.