PVN Madhav: నాడు పటేల్.. నేడు మోదీ
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:53 AM
దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆనాడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సంస్థాలను విలీనం చేస్తే...
సర్దార్ సంస్థానాలను విలీనం చేస్తే..జమ్మూకశ్మీర్‌ను పీఎం తీసుకొచ్చారు: మాధవ్
విజయవాడ, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఆనాడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సంస్థాలను విలీనం చేస్తే... నేడు ప్రధాని మోదీ స్వతంత్ర ప్రతిపత్తితో ఉన్న జమ్మూకశ్మీర్‌ను దేశంలో విలీనం చేశారని బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ ఎంజీ రోడ్డులో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు శుక్రవారం ఏక్తా ర్యాలీని నిర్వహించారు. పటేల్ కారణంగా నేడు దేశమంతా సమైక్యంగా ఉందని, ప్రజలందరూ స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయాలని మాధవ్ పిలుపునిచ్చారు. దీనికి ముందు బీజేపీ కార్యాలయంలోను పటేల్ జయంతిని నిర్వహించారు.