Share News

ప్రజాసేవకు ‘సంజీవని’

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:46 AM

పల్లెల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 108, 104 వాహనాలకు జీవం పోసేందుకు సిద్ధమైంది. సంజీవని పేరుతో ప్రజల వద్దకు 104 వాహనాలను తీసుకురానుంది.

ప్రజాసేవకు ‘సంజీవని’

- మల్లవల్లి పారిశ్రామికవాడలో సిద్ధమవుతున్న 104 వాహనాలు

- పేదలకు 47 రకాల సేవలు అందించేలా రూపకల్పన

(ఆంధ్రజ్యోతి, హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌):

పల్లెల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన 108, 104 వాహనాలకు జీవం పోసేందుకు సిద్ధమైంది. సంజీవని పేరుతో ప్రజల వద్దకు 104 వాహనాలను తీసుకురానుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ మల్లవల్లి పారిశ్రామికవాడలో చురుగ్గా జరుగుతోంది. ప్రకాశవంతమైన పసుపు, ఎరుపు రంగుల్లో ఆకర్షణీయంగా సంజీవని వాహనాలను తయారు చేస్తున్నారు. విజయవాడకు చెందిన భవ్య హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ వారి ఆధ్వర్యంలో సంజీవని వాహనాలు నూతన రూపు సంతరించు కుంటున్నాయి. 104 వాహనంలో 47 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా అత్యాధునిక సాంకేతిక పరికరాలను కూడా అమరుస్తున్నారు. ఆరోగ్య సమాచారం, తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణ వంటి వైద్య సేవలతో పాటు తాగునీటి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వ్యవస్థను కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, సత్యకుమార్‌ చిత్రాలతో కూడిన సంజీవని వాహనాలు త్వరలో ప్రజాసేవ చేసేందుకు గ్రామాలకు రానున్నాయి.

Updated Date - Aug 06 , 2025 | 12:46 AM