Share News

పారిశుధ్య కార్మికులే మన ఆరోగ్య పరిరక్షకులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:45 PM

చెత్తసేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులే మన ఆరోగ్య ప్రధాన పరిరక్షులు అని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు.

పారిశుధ్య కార్మికులే మన ఆరోగ్య  పరిరక్షకులు
కాలువలోని చెత్తను తొలగింపును పర్యవేక్షిస్తున్న డీపీవో రాజ్యలక్ష్మి, డీఎల్‌పీవో నూర్జహాన్‌

ప్రొద్దుటూరు రూరల్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): చెత్తసేకరణ చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులే మన ఆరోగ్య ప్రధాన పరిరక్షులు అని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్వచ్ఛతాహి సేవ- 2025 కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీలో డీపీవో రాజ్యలక్ష్మి, జమ్మలమడుగు డీఎల్‌పీవో నూర్జహాన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు చెత్తను రోడ్లపై, మురుగు కాలువల్లో పడవేయకుండా తడిచెత్త, పొడిచెత్త వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అందించి సహకరించాలని కోరారు. పారిశుధ్య కార్మికులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా మైదుకూరు రోడ్డులోని ప్రధాన రహదారికి ఇరువైపుల మురుగు కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారాలను పారిశుధ్య కార్మికులతో కలిసి డీపీవో, డీఎల్‌పీవో చెత్తను తొలగించారు. సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేలా అన్ని సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఖాదర్‌బాద్‌ సచివాలయ పరిధిలో ఉన్న విలేజ్‌ హెల్త్‌క్లీనిక్‌లో కార్మికులకు వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్‌ శివచంద్రారెడ్డి సమకూర్చిన కార్మికుల యూనిఫాం, గ్లౌజ్‌లు తదితర సామాగ్రిని డీపీవో రాజ్యలక్ష్మి, డీఎల్‌పీవో నూర్జహాన్‌, డిప్యూటీ ఎంపీడీవో రామాంజనేయుల రెడ్డి అందించారు.

Updated Date - Sep 26 , 2025 | 11:45 PM