Share News

పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేపట్టాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:25 PM

జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేపట్టి ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు.

పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేపట్టాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల హాస్పిటల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేపట్టి ప్రతి గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీడి యోకాన్ఫరెన్స హాల్‌ నుంచి ఆమె మండల ప్రత్యేకాధికారు లు, ఎంపీడీవోలు, ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో తాగునీరు, పారిశుధ్యంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామాల్లో పరిసరాలు చెత్తకుప్పలు, పేడ దిబ్బల్లేకుండా చర్యలు తీసుకోవాల న్నారు. మున్సిపల్‌ అధికారులు, పంచాయతీ సిబ్బంది, పబ్లిక్‌హెల్త్‌ అధికారులు సమన్వయంతో ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎలాం టి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. ట్యాంకులు ఎప్పటికప్పుడు క్లోరినేషన చేసి శుభ్రపరచాలన్నారు. ఈవోఆర్డీలు, పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పరిశుభ్రత వల్ల అంటువ్యాధులు నివా రించవచ్చన్నారు. జిల్లాకు మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈలకు సూచించారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఈ నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేసి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:25 PM