Share News

Indian Navy: సముద్ర శక్తి-2025 ప్రారంభం

ABN , Publish Date - Oct 16 , 2025 | 06:35 AM

భారత్‌, ఇండోనేషియా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు సముద్ర శక్తి-2025 పేరుతో బుధవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి.

Indian Navy: సముద్ర శక్తి-2025 ప్రారంభం

  • విశాఖలో భారత్‌, ఇండోనేషియా నావికాదళ సంయుక్త విన్యాసాలు

విశాఖపట్నం, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): భారత్‌, ఇండోనేషియా నౌకాదళాల సంయుక్త విన్యాసాలు ‘సముద్ర శక్తి-2025’ పేరుతో బుధవారం విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. ఈ విన్యాసాల్లో భారత తూర్పు నౌకాదళానికి చెందిన యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ కార్వెట్‌ ఐఎన్‌ఎస్‌ కవరత్తి, హెలికాప్టర్‌తో కూడిన ఇండోనేషియా నౌక కేఆర్‌ఐ జాన్‌ పాల్గొంటున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిర శాంతిభద్రతల కోసం రెండు దేశాలు పరస్పర అవగాహనతో పనిచేయడానికి, సాంకేతికతను ఇచ్చిపుచ్చుకోడానికి ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని నేవీ వర్గాలు తెలిపాయి. గతంలో నాలుగుసార్లు ఈ విన్యాసాలు జరగ్గా ఇది ఐదవది. మొదటి దశలో హార్బర్‌ విన్యాసాలు, క్రాస్‌ డెక్‌ సందర్శనలు, క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు, రెండో దశలో సముద్ర విన్యాసాలు ఉంటాయని నేవీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Oct 16 , 2025 | 06:35 AM