Health Checkup: మహిళలకు సఖి సురక్ష
ABN , Publish Date - Oct 08 , 2025 | 03:58 AM
పట్టణ మహిళా సంఘాల కోసం మెప్మా రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించనుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా సఖి సురక్ష కార్యక్రమాన్ని...
35 ఏళ్లు పైబడిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు
రేపు విశాఖలో ప్రారంభించనున్న మెప్మా
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణ మహిళా సంఘాల కోసం మెప్మా రెండు కొత్త కార్యక్రమాలను ప్రారంభించనుంది. ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’లో భాగంగా ‘సఖి సురక్ష’ కార్యక్రమాన్ని ఈ నెల 9న విశాఖలో ప్రారంభించనుంది. దీనిలో భాగంగా 35ఏళ్లు పైబడిన మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. 74 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా పట్టణ మహిళా సంఘాల కుటుంబాల్లోని నిరుద్యోగుల కోసం జాబ్‌మేళాలు నిర్వహిస్తారు. ఈ నెల 8న శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో 20 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు మెప్మా తెలిపింది.